: వైజాగ్ ల్యాండ్ స్కాంపై సిట్ దర్యాప్తు ప్రారంభం...కలెక్టరేట్ లో స్పెషల్ కౌంటర్ ఏర్పాటు చేశాం: వైజాగ్ సీపీ


విశాఖ ల్యాండ్ స్కాంపై సిట్ దర్యాప్తు ప్రారంభించింది. ఈ మేరకు పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ, సిట్ నిష్పాక్షిక దర్యాప్తు చేపడుతుందని అన్నారు. రికార్డుల ట్యాంపరింగ్, రికార్డుల తారుమారు వంటి అంశాలపై నిగ్గుతేలుస్తామని సిట్ అధికారులు తెలిపారు. వైజాగ్ భూ వివాదాలపై ఫిర్యాదులు ఎవరైనా ఈమెయిల్, మెసేజ్, వాట్స్ యాప్ ద్వారా చేయవచ్చని చెప్పారు. సిట్ దర్యాప్తు వివరాలు వారానికోసారి మీడియాకు వివరిస్తామని, నిర్ణీత గడువులోగా విచారణ పూర్తి చేస్తామని వారు చెప్పారు. వ్యక్తిగతంగా ఫిర్యాదులు చేసేవారికోసం విశాఖ కలెక్టరేట్ లో స్పెషల్ కౌంటర్ ఏర్పాటు చేయనున్నామని వారు పేర్కొన్నారు. ఉన్నతాధికారుల సూచనల మేరకు దర్యాప్తు వేగంగా పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు. 

  • Loading...

More Telugu News