: మూడు దేశాల పర్యటన తర్వాత ప్రధాని స్వదేశాగమనం
పోర్చుగల్, అమెరికా, నెదర్లాండ్స్ దేశాల్లో పర్యటన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం సాయంత్రం భారతదేశానికి బయల్దేరారు. ఈ విషయమై ప్రధానమంత్రి కార్యాలయం ట్వీట్ చేసింది. నిన్న ఉదయం నెదర్లాండ్స్ చేరుకున్న ప్రధాని ఆ దేశ ప్రధాని మార్క్ రుట్టేతో చర్చలు జరిపి, అక్కడి భారతీయులనుద్దేశించి ప్రసంగించారు. అంతకుముందు అమెరికాలో ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో కూడా ప్రధాని మంతనాలు జరిపారు. పాకిస్థాన్ విషయంలో, ఉగ్రవాదాన్ని తుదముట్టించడంలో సహకరించాలని మోదీ, ట్రంప్‌ను కోరారు. అలాగే పోర్చుగల్ పర్యటన సందర్బంగా ఆ దేశ ప్రధాని ఆంటోనియో కోస్టాతో కూడా ప్రధాని మాట్లాడటంతో పాటు ఆయనకు ఓవర్‌సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా గుర్తింపును బహూకరించారు.