: గుడ్ న్యూస్.. హైదరాబాదులో రూ. 1కే లీటర్ మంచినీళ్లు!
హైదరాబాద్ వాసులకు శుభవార్త. ఇప్పటి వరకు రూ. 5కే భోజనాన్ని అందిస్తూ, ఎంతో మంది ఆకలి తీరుస్తున్న జీహెచ్ఎంసీ... మరో కీలక నిర్ణయం తీసుకుంది. కేవలం రూ. 1కే లీటర్ సురక్షిత తాగునీటిని అందించాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో మంచినీటి శుద్ధి కేంద్రాల ఏర్పాటుకు అవసరమైన చర్యలను ప్రారంభించింది. పర్యావరణానికి హాని చేయని విధంగా, రసాయనాలను ఉపయోగించకుండా నీటిని శుద్ధి చేయగలిగిన సంస్థలకు ఈ కేంద్రాలను అప్పచెప్పనున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలోని బస్టాపులు, ప్రభుత్వ కార్యాలయాలు, ఆసుపత్రులతో పాటు ఇతర రద్దీ ప్రాంతాల్లో సురక్షిత తాగునీటి కేంద్రాలను నెలకొల్పనున్నారు. ఈ కార్యక్రమాన్ని ఆగస్టు నెలలోపే ప్రారంభించడానికి జీహెచ్ఎంసీ సిద్ధమవుతోంది.