: బాబాయ్ కోసం సినిమా విడుదలను వాయిదా వేసుకుంటున్న ఎన్టీఆర్, కల్యాణ్ రామ్!


నందమూరి బాలకృష్ణ నటిస్తున్న 'పైసా వసూల్' సినిమా సెప్టెంబర్ 29న విడుదల కాబోతోంది. ఈ సినిమాకు సరిగ్గా వారం ముందు... అంటే సెప్టెంబర్ 21న జూనియర్ ఎన్టీఆర్ నటించిన 'జై లవకుశ' చిత్రం విడుదల కావాలి. ఈ చిత్రాన్ని తారక్ అన్న కల్యాణ్ రామ్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, బాబాయ్, అబ్బాయ్ ల సినిమాలు ఒకే సమయంలో విడుదల కానుండటం చర్చనీయాంశం అయింది. విడుదల విషయంలో ఎవరైనా రాజీ పడతారా? అనే ప్రశ్న తెలెత్తింది. దీంతో, అభిమానులకు తప్పుడు సంకేతాలను పంపడం ఇష్టంలేక తారక్, కల్యాణ్ రామ్ లే రాజీపడ్డారని సమాచారం. బాబాయ్ సినిమా కోసం తమ సినిమా విడుదలను వాయిదా వేయాలని తారక్ నిర్ణయించినట్టు తెలుస్తోంది. బాబాయ్ తో పోటీపడటం కల్యాణ్ రామ్ కు కూడా ఇష్టం లేదట. 

  • Loading...

More Telugu News