: పిచ్చి తండ్రి: కూతురు చనిపోతుందని ముందే గొయ్యి తవ్వాడు... రోజూ అందులో పడుకోబెడుతున్నాడు!
ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న కుమార్తె చనిపోతుందని ముందుగానే ఆమెను పూడ్చేందుకు గొయ్యి తవ్వి... రోజూ ఆమెను కాసేపు అందులో పడుకోబెడుతున్న చిత్రమైన ఘటన చైనాలో చోటుచేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే... చైనాలోని సిచువాన్ ప్రావిన్స్ కి చెందిన లియోంగ్ అనే రైతుకి రెండేళ్ల పాప ఉంది. ఆమె పుట్టుక నుంచీ ప్రాణాంతక వ్యాధితో బాధపడుతోంది. కుమార్తెను రక్షించుకునేందుకు సంపాదించినదంతా ధారపోశాడా తండ్రి.
చికిత్స చేసిన వైద్యులు కూడా పాప ఇక బతికేది కొన్ని రోజులేనని తేల్చిచెప్పారు. దీంతో ఆమె మరణించిన అనంతరం తన పొలంలోనే కుమార్తెను పూడ్చిపెట్టేందుకు గుంత తవ్వాడు. పాపను ప్రతిరోజూ సాయంత్రం ఆడిస్తూ, ఆ గుంతలో కాసేపు పడుకోబెడుతున్నాడు. పాపతోపాటు తాను కూడా అందులోనే పడుకుంటున్నాడు. ఇలా చేయడం వల్ల పాపకి ఇప్పటి నుంచే పడుకోవడం అలవాటవుతుందని, తండ్రిగా ఇంతకు మించి ఏమీ చేయలేకపోతున్నానని సమాధానం చెబుతున్నాడు.