: శిరీష ఆత్మహత్య కేసు దర్యాప్తులో హైడ్రామా...మీడియాను మభ్యపెట్టిన పోలీసులు... పెరుగుతున్న అనుమానాలు!
హైదరాబాదులోని ఫిల్మ్ నగర్ లో ఆర్జే స్టూడియోలో ఆత్మహత్యకు పాల్పడిన శిరీష కేసు దర్యాప్తులో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. రెండు రోజుల కస్టడీ నిమిత్తం రాజీవ్, శ్రవణ్ లను అదుపులోకి తీసుకున్న పోలీసులు వైద్యపరీక్షల పేరుతో వారిని అర్థరాత్రి గోప్యంగా ఉస్మానియా ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యపరీక్షల అనంతరం రాత్రి 12:15 నిమిషాలకు మీడియా కంటబడకుండా రహస్యంగా సీన్ కన్ స్ట్రక్షన్ పేరిట కుకునూరుపల్లి తీసుకెళ్లారు.
పోలీస్ స్టేషన్, హెడ్ క్వార్టర్స్ లోపలికి వెళ్లకుండా... శిరీష ఆత్మహత్య చేసుకున్న రోజున ఎక్కడెక్కడ తిరిగారో అక్కడే మరోసారి వాహనాల్లో తిప్పి తిరిగి హైదరాబాదు తీసుకొచ్చారు. దీనిపై పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. శిరీష కుటుంబ సభ్యులు లేవనెత్తిన అనుమానాలపై పోలీసులు ఎలాంటి విచారణ జరపడం లేదని మరోసారి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.