: పలు దేశాల్లో పనిచేయని కంప్యూటర్లు.. అసాధారణ సైబర్ దాడి.. మరోసారి పంజా విసిరిన హ్యాకర్లు
హ్యాకర్లు మరోసారి తీవ్ర కలకలం రేపారు. యూరప్‌లో భారీ సైబర్ దాడి జరిగింది. బ్రిటన్, ఉక్రెయిన్, స్పెయిన్లలో పలు వ్యవస్థలపై సైబర్ దాడి జరిగింది. ముఖ్యంగా ఉక్రెయిన్‌లోని నేషనల్ బ్యాంక్స్, స్టేట్ పవర్ ప్రొవైడెర్, ఎయిర్‌పోర్టుల్లోని కంప్యూటర్లు సైబర్‌దాడికి గురయ్యాయి. ఈ సైబర్ దాడిపై ఉక్రెయిన్ ప్రధాని మాట్లాడుతూ అసాధారణ సైబర్ దాడిగా అభివర్ణించారు. తమ ప్రభుత్వం వెబ్‌సైట్‌లు ఆపరేట్ చేయలేని స్థితిలో ఉన్నాయని ప్రకటించారు. మరోవైపు రష్యన్ ఎనర్జీ ఫామ్స్, దనీష్ షిప్పింగ్ కంపెనీలు కూడా సైబర్ దాడికి గురయ్యాయి. ఈ భారీ దాడికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇటీవలే రామ్సన్ వేర్ వైరస్ ప్రపంచ దేశాలను గడగడలాడించిన విషయం తెలిసిందే. ఆ దాడి నుంచి పూర్తిగా బయటకు రాకముందే మరోసారి భారీ సైబర్ దాడితో హ్యాకర్లు పంజా విసిరారు.