: థ్రెడ్ మిల్ పై నవ్వు పుట్టించే నడకలు.. ఈ వీడియో చూస్తే మీకు చక్కిలిగింతలు!


ప్రస్తుత కాలంలో చాలామంది తమ ఆరోగ్యంపై శ్రద్ధ కనబరుస్తున్నారు. కొద్దోగొప్పో వ్యాయామం చేసి, తమ శరీరానికి చెమట పట్టించి, ఆరోగ్యాన్ని సొంతం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో వాకింగ్, బ్రిస్క్ వాకింగ్, రన్నింగ్ చేయడం, జిమ్ లో వ్యాయామం లేదా ఇంట్లో యోగా వంటివి చేస్తుంటారు. ఇక బయటకు వెళ్లి వాకింగ్ చేయలేని వారైతే థ్రెడ్ మిల్ పై నడవడం చూస్తుంటాం.

అయితే, థ్రెడ్ మిల్ పై వివిధ వయసుల వారు పలు సందర్భాల్లో ఏ విధంగా నడుస్తారనే విషయాన్ని స్టాప్ మోషన్ యానిమేటర్ కెవిన్ బిపెర్రీ చేసి చూపించారు. దీనిని వీడియోలో పొందుపరచి, దానిని తన ఇన్ స్టా గ్రామ్ ఖాతా ద్వారా పోస్ట్ చేశారు. వీక్షకులను కడుపుబ్బ నవ్విస్తున్న ఈ వీడియోలో, మహిళలు ఎలా నడుస్తారనే దానితో పాటు ఓ వ్యక్తి కోపంగా ఉన్నప్పుడు, తాగినప్పుడు ఎలా నడుస్తాడనేది, అలాగే రోబో, చింపాంజీల నడక ఎలా ఉంటుందనేది.. ఇలా పలు నడకలు ఏ విధంగా ఉంటాయో థ్రెడ్ మిల్ పై బిపెర్రీ చేసి చూపించారు.

  • Loading...

More Telugu News