: సీఎం చంద్రబాబు మందలించినా తీరు మార్చుకోని అటవీశాఖ!
జులై రెండో వారంలో వనమహోత్సవం నిర్వహించవద్దని ఏపీ సీఎం చంద్రబాబు గతంలో మందలించినా అటవీ శాఖ తీరులో ఎటువంటి మార్పు రాలేదు. మళ్లీ ఈ ఏడు కూడా అదే నెలలో వనమహోత్సవం నిర్వహించేందుకు అటవీశాఖ సిద్ధమైంది. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు సదరు అధికారులపై మండిపడ్డట్టు సమాచారం. కాగా, అటవీ శాఖా మంత్రి శిద్దా రాఘవరావుతో నిర్వహించిన సమీక్షలో జులై రెండో వారంలోనే వనమహోత్సవం నిర్వహించాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ‘జులై రెండో వారంలో వన మహోత్సవం ఏంటి?’ అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.