: మా వ్యతిరేకులకు బ్రిటన్ వేదికలా మారింది: ఇండియా రాయబారి విమర్శలు


భారతీయ బ్యాంకుల్లో కోట్లాది రూపాయలు అప్పులు చేసి లండన్‌కు చెక్కేసిన బ‌డా వ్యాపార వేత్త, లిక్కర్ కింగ్‌ విజయ్ మాల్యాను తిరిగి దేశానికి రప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని ప్ర‌య‌త్నాలూ చేస్తోన్న విష‌యం తెలిసిందే. అయిన‌ప్ప‌టికీ ఆయ‌న‌ను భారత్‌కి ర‌ప్పించే ప్ర‌య‌త్నాలు విఫ‌ల‌మ‌వుతుండ‌డంతో బ్రిట‌న్‌పై భార‌త్ విమ‌ర్శ‌లు చేసింది. బ్రిట‌న్‌ నేరస్తుల పాలిట స్వర‍్గంలా మారింద‌ని అక్క‌డి భారత రాయబారి వైకే సిన్హా అన్నారు.

 భార‌త‌ వ్యతిరేకులకు, నేరస్తులకు వేదికగా యూకే మారిందని ఆయ‌న వ్యాఖ్యానించారు. భార‌త్ కూడా ప్రజాస్వామ్య దేశమేన‌ని, అయితే, భార‌త్ మాత్రం బ్రిట‌న్‌లా స్నేహితులకు, సన్నిహితులకు ఇబ్బందులు కలిగే చర్యలను తలపెట్టబోద‌ని ఆయ‌న అన్నారు. బ్రిట‌న్ స‌ర్కారు తీరుపై భార‌త ప్ర‌జ‌లు అసంతృప్తితో ఉన్నార‌ని అన్నారు.

  • Loading...

More Telugu News