: మాజీ క్రికెటర్ శ్రీశాంత్ నటించిన ‘టీమ్ 5’ త్వరలో ప్రేక్షకుల ముందుకు!


టీమిండియా మాజీ క్రికెటర్ శ్రీశాంత్ నటించిన బహుభాషా చిత్రం ‘టీమ్ 5’ త్వరలో విడుదల కానుంది. ఫ్యామిలీ డ్రామా ఎంటర్ టెయినర్ గా రూపొందించిన ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో వచ్చే నెల 14న విడుదల చేయనున్నారు. ఈ చిత్రానికి కథ అందించిన సురేష్ గోవింద్ దర్శకత్వమూ వహించారు. శ్రీశాంత్ సరసన హీరోయిన్ నిక్కీ గల్రాని నటిస్తోంది. కాగా, బాలీవుడ్ మూవీ ‘అక్సర్ 2’లో కూడా శ్రీశాంత్ నటించాడు. ఈ చిత్రం ఈ ఏడాదిలో విడుదల కానున్నట్టు తెలుస్తోంది. 

  • Loading...

More Telugu News