: ట్విట్టర్‌లో మిలియన్ ఫాలోవర్లను చేరుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్
సోషల్ మీడియాపై మొదట అంతగా దృష్టిపెట్టని జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు ట్విట్టర్‌ను తెగవాడేస్తున్నాడు. 2009లో ఆయన ట్విట్టర్ ఖాతాను తెరిచాడు. పండుగ శుభాకాంక్షల నుంచి తన సినిమాల వరకు, త్వరలో ప్రారంభం కాబోతున్న తన టీవీ ప్రోగ్రాం నుంచి ప్రముఖులకు శుభాకాంక్షలు తెలపడం వరకు అన్నింటికీ ఆయన ట్విట్టర్‌ను ఉపయోగించుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా ఎన్టీఆర్ కి ట్విట్టర్‌లో ఫాలోవర్స్ సంఖ్య మిలియన్ దాటేసింది. ప్రస్తుతం ఆయన జై లవకుశ సినిమాలో నటిస్తూ, టీవీ షో బిగ్‌బాస్‌లో హోస్ట్‌గా వ్యవహరిస్తూ బిజీబిజీ ఉంటున్నాడు.