: ఢిల్లీలో బోనమెత్తిన వెంకయ్యనాయుడు
ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో మహంకాళి అమ్మవారి బోనాల వేడుకలు కన్నుల పండువగా జరిగాయి. ఈ వేడుకలకు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు హాజరయ్యారు. కేంద్ర ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. ఆ తర్వాత బోనమెత్తి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఉత్సవాన్ని ఢిల్లీలో ఘనంగా నిర్వహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి, ఆలయ కమిటీకి, అధికారులకు అభినందనలు తెలిపారు. గత మూడేళ్లుగా ఢిల్లీలో బోనాల పండుగ నిర్వహించడం చాలా గొప్ప విషయమని అన్నారు. మన సంప్రదాయ పండుగలను భవిష్యత్ తరాలకు అందించాల్సిన అవసరం ఉందని తెలిపారు.