: బోరు బావిలో పడి మరో చిన్నారి మృతి.. మహారాష్ట్రలో దుర్ఘటన!


భారత్‌లో బోరుబావులు చిన్నారుల ప్రాణాలు తీస్తున్నాయి. అందులో ప‌డి చిన్నారులు ప్రాణాలు కోల్పోతున్న ఘ‌ట‌న‌లు ఎన్నో వెలుగులోకి వ‌స్తున్నప్ప‌టికీ బోరుబావుల య‌జ‌మానులు నిర్ల‌క్ష్యాన్ని వీడ‌డం లేదు. ఫ‌లితంగా అభం శుభం ఎరుగ‌ని చిన్నారులు త‌ల్లిదండ్రుల‌కు క‌డుపుకోతమిగిల్చి వెళ్లిపోతున్నారు. రంగారెడ్డి జిల్లాలో ఇటీవ‌ల జ‌రిగిన చిన్నారి మీనా ఘ‌ట‌న‌ను మ‌ర‌వ‌క‌ముందే మహారాష్ట్రలో సతారా జిల్లాలోనూ ఇటువంటిదే మ‌రో ఘ‌ట‌న‌ చోటు చేసుకుంది. విరాలీ గ్రామంలో ఓ రైతు కుమారుడు మంగేష్‌(5) నిన్న‌ మధ్యాహ్నం ఆడుకుంటూ పొలంలో ఉన్న బోరుబావిలో పడిపోయాడు.

ఎన్డీఆర్‌ఎఫ్ బృందం అక్క‌డ‌కు చేరుకుని బోరు బావి నుంచి గ‌త అర్ధ‌రాత్రి దాటాక బాలుడిని బ‌య‌ట‌కు తీశారు. ఆ బాలుడిని ప‌రిశీలించిన వైద్యులు అప్పటికే ప్రాణాలు కోల్పోయాడ‌ని చెప్పారు. బోరుబావి 300 అడుగుల లోతు ఉన్నప్పటికీ ఆ బాలుడు బోరుబావిలో 20 అడుగుల లోతులోనే ఉన్నాడ‌ని, అతడిపై మట్టి, బురద పడటంతో ఊపిరాడక ప్రాణాలుకోల్పోయి ఉండొచ్చ‌ని వైద్యులు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News