: ‘మై టూ బాయ్స్’ అంటున్న ధోనీ భార్య సాక్షి!


‘మై టూ బాయ్స్’ అనే క్యాప్షన్ తో ధోనీ భార్య సాక్షి తన ఇన్ స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఓ ఫొటోను షేర్ చేసింది. ఈ ఫొటోలో శిఖర్ ధావన్ కుమారుడు, విండీస్ ప్లేయర్ డ్వేన్ బ్రావో కుమారుడిని ఆప్యాయంగా తన చేతులతో సాక్షి దగ్గరకు తీసుకున్నారు. మరో ఆసక్తికరమైన విషయమేమిటంటే, ఈ సెల్ఫీ నిమిత్తం సాక్షి సహా ఇద్దరు చిన్నారులు తమ ముఖకవళికలను తమాషాగా పెట్టారు.

ఆదివారం భారత్-వెస్టిండీస్ మధ్య జరిగిన రెండో వన్డే అనంతరం టీమిండియా ఆటగాళ్లు, వెస్టిండీస్ జట్టు ఆటగాడు డ్వేన్ బ్రావో ఇంటికి వెళ్లిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ధావన్, బ్రావో కుమారులతో కలిసి సాక్షి ఈ ఫొటో దిగారు. కాగా, ఈ నెల 30న జరగనున్న మూడో వన్డే నిమిత్తం భారత జట్టు నిన్న ఉదయం ప్రత్యేక బస్సులో ఆంటిగ్వా బయలుదేరి వెళ్లింది. ధోని భార్య సాక్షి, కుమార్తె జీవాతో పాటు, ధావన్ భార్య, కుమారుడు కూడా ఈ బస్సులోనే ప్రయాణించారు. ఈ సందర్భంగా దిగిన ఓ ఫొటోను ధావన్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ‘ఆంటిగ్వాకు వెళ్తున్నాం. చిన్నారులు ఆటలాడుతూ అందరి ముఖాల్లో నవ్వులు తెప్పించారు’ అని ఆ ట్వీట్ లో పేర్కొన్నాడు. కాగా, ఐదు వన్డేల సిరీస్ లో 1-0తో భారత్ ఆధిక్యంలో ఉంది. తొలి వన్డే వర్షం కారణంగా రద్దయిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News