: కోచ్ పదవికి జయవర్ధనే సరిపోడు: శ్రీలంక క్రికెట్ బోర్డు అధ్యక్షుడు
ఛాంపియన్స్ ట్రోఫీలో వైఫల్యం అనంతరం శ్రీలంక క్రికెట్ జట్టు హెడ్ కోచ్ పదవికి గ్రాహం ఫోర్డ్ రాజీనామా చేశాడు. శ్రీలంక క్రికెట్ బోర్డు అధ్యక్షుడు తిలంగా సుమతిపాలతో గ్రాహం ఫోర్డ్ కు విభేదాలు ఉన్నాయి. దీంతో, అతను తన పదవికి గుడ్ బై చెప్పాడు. దీంతో, హెడ్ కోచ్ కోసం వేటను మొదలు పెట్టింది క్రికెట్ బోర్డు.
ఈ నేపథ్యంలో, శ్రీలంక మాజీ కెప్టెన్ మహేల జయవర్ధనే కోచ్ గా ఎంపిక అవుతాడనే వార్తలు వినిపించాయి. ఇప్పటికే కోచ్ గా జయవర్ధనేకు కొంచెం అనుభవం ఉంది. అయితే, ఈ వార్తలను సుమతిపాల కొట్టివేశాడు. జయవర్ధనేకు ఉన్న కొద్దిపాటి అనుభవం... హెడ్ కోచ్ పదవికి సరిపోదని ఆయన అన్నాడు. ప్రధాన కోచ్ పదవిలో మహేల లేడని తేల్చిచెప్పాడు. అయితే టీ20 బ్యాటింగ్ కోచ్, ఫీల్డింగ్ కోచ్ గా అయితే అతను సెట్ అవుతాడని అన్నారు.