: ఏ ఛానెల్ నీది? ఆ మాట అడగడానికి నీకు ఏం హక్కు ఉంది?: బీసీసీఐ మాజీ అధ్యక్షుడు మండిపాటు
బీసీసీఐ మాజీ అధ్యక్షుడు శ్రీనివాసన్ మీడియాపై మండిపడ్డారు. నిన్న ముంబయిలో నిర్వహించిన బీసీసీఐ సర్వసభ్య సమావేశంలో తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ తరఫున పాల్గొన్న శ్రీనివాసన్‌ను ఓ విలేకరి పలు ప్రశ్నలు అడిగాడు. ‘లోధా కమిటీ సిఫార్సుల మేరకు 70 సంవత్సరాల పైబడిన వారు క్రికెట్ సంఘాల్లో ఉండకూడదు కదా, మీరు 72 ఏళ్లు వచ్చినా ఉన్నారేంటీ?’ అని ఓ విలేకరి అడగగా... అందుకు ఆగ్రహం తెచ్చుకున్న శ్రీనివాస్ ఆ విలేకరిని ఎక్కడ నుంచి వచ్చావు? నీది ఏ ఛానెల్? అని ప్రశ్నించారు. ఆ మాట అడగడానికి నీకు ఏం హక్కు ఉంది? అని మండిపడ్డారు. అనంతరం ఈ సమావేశంలో సభ్యులు లోధా సంస్కరణల అమలుకు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపినట్లు శ్రీనివాసన్ పేర్కొన్నారు.