: జాతిపిత శాలువాని పాడుకోవచ్చు
మన జాతిపిత స్వయంగా నేసి, ఉపయోగించిన శాలువా మీకు కావాలనుకుంటున్నారా...? అయితే బ్రిటన్‌లోని లడ్లౌలో జరిగే వేలానికి వెళ్లి పాడుకోవచ్చు. ఇదేకాదు, ఆయన ఉపయోగించిన మరికొన్ని వస్తువులు కూడా ఈ సందర్భంగా వేలానికి రానున్నాయి. 1924లో జుహూలో గాంధీ ఉన్న సమయంలో ఆయన వాడిన దుప్పటి, శాలువా, జపమాల, గరిటె, ఫోర్క్, పాత్ర, కప్పు, ఏనుగు దంతంతో చేసిన 'మూడు కోతుల బొమ్మ' తోబాటు ఇంకా ఆయన 1921లో రాసిన విల్లు, పవర్ ఆఫ్ అటార్నీ పత్రాలు, ఇంకా ముఖ్యమైన ఉత్తరాలు కూడా ఈ వేలంలో జనం ముందుకు రానున్నాయి.
ఇందులో శాలువా ప్రత్యేకత గురించి ముందే చెప్పాంగా.... ఈ వస్తువులు ఈనెల 21న వేలానికి రానున్నాయి. ఆసక్తిగలవారు జాతిపిత వస్తువులను సొంతం చేసుకోవచ్చు... గతంలో విజయ్ మాల్యా గాంధీగారి వస్తువులను కొన్నింటిని వేలంలో పాడి, తిరిగి ప్రభుత్వానికే అప్పగించారు. మరి ఇప్పుడు ఎవరు గాంధీగారి వస్తువులను పాడుకోనున్నారో.... ఈనెల 21 వరకూ వేచిచూడాల్సిందే...!