: 'డీజే' సినిమాకు తాగి వచ్చి.. థియేటర్లో హల్ చల్ చేసిన 10 మంది యువకులు.. ఘర్షణ!
కర్నూలు జిల్లా నంద్యాలలోని ఖలీల్ థియేటర్లో నిన్న సాయంత్రం అలజడి చెలరేగింది. అల్లు అర్జున్ ‘డీజే’ సినిమాకు తాగి వచ్చిన పది మంది యువకులు బీభత్సం సృష్టించారు. బాగా తాగి అల్లరి చేస్తూ విజిల్స్ వేస్తూ థియేటర్‌లోని ఇతర ప్రేక్షకులకు ఇబ్బంది కలిగించారు. అలా చేయకూడదని చెప్పిన వారిపై దాడికి దిగారు. థియేటర్ నిండుగా ప్రేక్షకులు ఉండటంతో అందరూ అభ్యంతరం తెలిపారు. మద్యం మత్తులో ఎవరి మాటా వినని ఆ యువకులు రెచ్చిపోతూనే ఉన్నారు. కొంతమంది ప్రేక్షకులపై చేయి చేసుకున్నారు. ఆ క్రమంలో వడ్డె సుబ్బరాయుడు అనే మరో వ్యక్తి తన వద్ద ఉన్న కత్తితో అల్లరి చేస్తున్న యువకులపై దాడి చేశాడు. దీంతో రెహమాన్, రహిమాన్, షేక్ నమీర్ అనే ముగ్గురు యువకులకు గాయాలయ్యాయి. వీరిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.