: భరత్ దుర్మరణంతో షాకైన జూనియర్ ఎన్టీఆర్ షో నిర్వాహకులు
హీరో రవితేజ సోదరుడు భరత్ రోడ్డు ప్రమాదంలో దుర్మరణంపాలైన సంగతి తెలిసిందే. పలు సినిమాల్లో నటించిన భరత్ కు 'బిగ్ బాస్' షోలో పాల్గొనే అవకాశం వచ్చిందని అతని బాబాయ్ చెప్పారు. అయితే అందరూ సల్మాన్ ఖాన్ హోస్ట్ చేస్తున్న షోలో అని అనుకున్నారు. కానీ, అసలు విషయాన్ని ఓ ఆంగ్ల పత్రిక వెల్లడించింది. భరత్ కు ఆఫర్ వచ్చింది సల్మాన్ షోలో కాదట. జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న తెలుగు 'బిగ్ బాస్' షోలోనట. ఎన్టీఆర్ షో కోసం భరత్ ను ఓ పార్టిసిపెంట్ గా సెలెక్ట్ చేశారట. దీని కోసం భరత్ కు భారీ మొత్తాన్నే ఆఫర్ చేశారని సమాచారం. ఈ నేపథ్యంలో భరత్ హఠాన్మరణం వార్త విన్న నిర్వాహకులు షాక్ కు గురయ్యారట.