: విద్యార్థులందరి సెల్ ఫోన్లను తీసుకొని బద్దలు కొట్టేసిన టీచర్లు!
తరగతి గదుల్లోకి సెల్ఫోన్లు తీసుకురాకూడదని టీచర్లు సూచిస్తుంటారు. అయినప్పటికీ విద్యార్థులు అదే పనిచేస్తూ కోపం తెప్పిస్తారు. ఒకవేళ విద్యార్థుల వద్ద సెల్ఫోన్లు ఉన్నాయని టీచర్లు గుర్తిస్తే దాన్ని లాక్కుని మళ్లీ స్కూల్ అయిపోయాక తిరిగి ఇచ్చేస్తుంటారు. లేదంటే విద్యార్థుల తల్లిదండ్రులకు ఆ విషయాన్ని తెలిపి పిల్లలకు సెల్ఫోన్లు ఇవ్వకూడదని చెబుతుంటారు. కానీ, చైనాలోని ఓ సెకండరీ పాఠశాలలో మాత్రం విద్యార్థులు అధికంగా ఫోన్లు వాడుతున్నారని తెలుసుకున్న టీచర్లు వారి ఫోన్లు లాక్కుని వారి కళ్లముందే ఒక్కో ఫోనుని పగులకొట్టేశారు.
తమ సెల్ఫోన్లు బద్దలైపోతోంటే ఆ పిల్లలు ఎంతగానో బాధపడిపోయారు. ఈ పని చేసేటప్పుడు ఆ విద్యార్థుల తల్లిదండ్రులను కూడా సంప్రదించారు. వారు కూడా తమ పిల్లల సెల్ఫోన్లను వారి కళ్ల ముందే పగులకొట్టడానికి ఒప్పుకున్నారు. టీచర్లు మంచిపనే చేస్తున్నారని తల్లిదండ్రులు కితాబిచ్చారు. సెల్ఫోన్లను పగులకొడుతుంటే ఆ పిల్లల బాధ వర్ణనాతీతం.