: ఎప్పుడో ఒకసారి ఆ రెస్టారెంట్ కు వెళ్లి తప్పకుండా తింటాను: దీపికా పదుకునే


షారూఖ్ ఖాన్, దీపికా పదుకునే జంటగా నటించిన 'చెన్నై ఎక్స్ ప్రెస్' సినిమాలో షారూఖ్...నిద్రలో ఉన్నట్టుండి 'తంగబలి' అని గట్టిగా అరుస్తాడు. ఇది సరదాగా ఫన్నీ కోసం పెట్టిన సన్నివేశం...అయితే 'తంగబలి' తరువాత బాగా ఫేమస్ డైలాగ్ గా మారింది. ఈ నేపథ్యంలో హాలీవుడ్ లో సెటిలయ్యేందుకు ప్రయత్నాలు ప్రారంభించిన దీపిక, ఈమధ్య ముంబయ్ లో కారులో తన ఫ్లాట్‌ కి వెళ్తున్నప్పుడు దారిలో 'తంగబలి' రెస్టారెంట్‌ ని చూసిందట.

ఈ విషయాన్ని దీపిక స్వయంగా చెబుతూ, ‘తంగబలి' పేరుతో ఉన్న రెస్టారెంట్‌ ని చూశాను. నిజంగా దాన్ని చూసి నవ్వు ఆపుకోలేకపోయా. నాకు దక్షిణాది వంటలంటే చాలా ఇష్టం. ఎప్పుడైనా ఆ రెస్టారెంట్‌ కి తినేందుకు వెళ్తాను’ అని చెప్పింది. దీపిక లాంటి స్టార్ హీరోయిన్ చెప్పడంతో ‘తంగబలి' రెస్టారెంట్ కు విశేషమైన ప్రాచుర్యం వచ్చింది. 

  • Loading...

More Telugu News