: శిరీష మృతి కేసు.. తొలిసారి స్పందించిన తేజస్విని


బ్యూటీషియన్ శిరీష మృతి కేసులో తేజస్విని తొలిసారి స్పందించింది. కేసు అనేక మలుపులు తిరుగుతున్నా, ఇంతవరకు మీడియా ముందుకు రాని తేజస్విని పోలీసులకు తన వాంగ్మూలం ఇచ్చింది. శిరీష ఆత్మహత్యకు పాల్పడిందనే వార్త తనకు ఎంతో బాధను కలిగించిందని చెప్పింది. ఇంత చిన్న విషయానికే శిరీష ఆత్మహత్య చేసుకుంటుందని తాను అనుకోలేదని వాంగ్మూలంలో ఆమె తెలిపింది.

తాను, రాజీవ్ ప్రేమించుకున్నామని... పెళ్లి చేసుకోవాలని అనుకున్నామని తెలిపింది. కేవలం రాజీవ్ కోసమే తాను బెంగళూరు నుంచి హైదరాబాదుకు ట్రాన్స్ ఫర్ చేయించుకున్నానని చెప్పింది. ఇక్కడకు వచ్చిన తర్వాత శిరీష, రాజీవ్ లు క్లోజ్ గా ఉండటాన్ని గమనించానని తెలిపింది. వీరిద్దరూ చనువుగా ఉండటం తనకు నచ్చలేదని... ఇదే విషయంపై రాజీవ్ తో తాను చాలా సార్లు గొడవపడ్డానని వెల్లడించింది. 

  • Loading...

More Telugu News