: 36 లక్షల పన్ను చెల్లించిన చిత్తూరు పూల వ్యాపారి!
చిత్తూరు జిల్లా కేంద్రానికి చెందిన పూల వ్యాపారి 36 లక్షల రూపాయలు ఆదాయపు పన్ను చెల్లించడం సంచలనంగా మారింది. రఘురామ్ అనే పూల వ్యాపారి చిత్తూరుతో పాటు కాణిపాకంలో కూడా పూల వ్యాపారం చేస్తారు. ఆయన కాణిపాకంలో 2 కోట్ల రూపాయలు వెచ్చించి ఒక కల్యాణ మండపం నిర్మించారు. అయితే ఆ కళ్యాణమండపం నిర్మించేందుకు అయిన ఖర్చును ఎక్కడి నుంచి ఎలా తెచ్చారన్నదాని లెక్కలు చూపించలేదు. దీంతో ఐటీ అధికారులు ఇటీవలే ఆయనకు నోటీసులు పంపించారు. దీంతో వెంటనే ఆయన పన్ను మొత్తం చెల్లించారు. ఈ విషయం చిత్తూరులో సంచలనంగా మారింది.