: ఎవరినీ కాపాడే అవసరం మాకు లేదు... అనవసర విమర్శలు చేయవద్దు: శిరీష కేసులో డీసీపీ హెచ్చరిక
శిరీష అనుమానాస్పద మృతి విషయంలో విచారణను వేగవంతం చేశామని, నిందితులు రాజీవ్, శ్రవణ్ లతో పాటు పలువురిని ప్రశ్నించామని డీసీపీ వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ ఉదయం మీడియాతో మాట్లాడిన ఆయన, ఈ కేసులో అనవసర విమర్శలు చేయవద్దని హెచ్చరించారు. శిరీష బంధువులకు ఏమైనా అనుమానాలు ఉంటే హైదరాబాద్ కు రావాలని, వారి అనుమానాలన్నీ నివృత్తి చేస్తామని తెలిపారు.
ఆమె బంధువులు మీడియా ముందు చేస్తున్న విమర్శలపై స్పందించిన ఆయన, తమకు ఎవరినీ కాపాడాలన్న ఉద్దేశం గానీ, అవసరం గానీ లేవని అన్నారు. శిరీష పంపిన వాట్స్ యాప్ లొకేషన్ కుకునూరుపల్లి పీఎస్ క్వార్టర్స్ దేనని మరోసారి స్పష్టం చేసిన ఆయన, ఆమెపై అత్యాచారం జరిగిందా? లేదా? అన్న విషయం ఫోరెన్సిక్ నివేదిక వచ్చిన తరువాతనే తెలుస్తుందని పేర్కొన్నారు. కేసును తాము తప్పుదోవ పట్టిస్తున్నామని వస్తున్న విమర్శలను కొట్టి పారేశారు.