: మోదీకి ట్విట్టర్ లో 'థ్యాంక్స్' చెప్పిన ఇవాంకా ట్రంప్!
తన అమెరికా పర్యటనలో భాగంగా మోదీ వైట్ హౌస్ కు వెళ్లిన సమయంలో ట్రంప్ కుమార్తె ఇవాంకాను ఉద్దేశించి ప్రపంచ ఔత్సాహికుల ఫోరమ్, అమెరికా బృందానికి నాయకత్వం వహించాలని అడిగారు. అమెరికన్ ఔత్సాహికులతో కలసి, భారత్ లో జరిగే 'గ్లోబల్ ఎంటర్ ప్రెన్యూర్ షిప్ సమ్మిట్'కు రావాలని, ఆమె వస్తుందనే భావిస్తున్నానని ప్రధాని అన్నారు.
ఇక, మోదీ, అమెరికా నుంచి వెళ్లిన తరువాత ఇవాంకా ట్రంప్, తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెట్టారు. "ఇండియాలో జరగనున్న గ్లోబల్ ఎంటర్ ప్రెన్యూర్ షిప్ సమ్మిట్ కు హాజరయ్యే యూఎస్ బృందానికి నన్ను నాయకత్వం వహించమని కోరినందుకు ప్రధాని మోదీకి థ్యాంక్యూ" అని అన్నారు. ఈ ట్వీట్ ను ఈ ఉదయం 7:42కు ఇవాంకా పెట్టగా, వేల కొద్దీ లైక్స్, షేర్స్ తెచ్చుకుంది.