: రాజీవ్ తెలుసంటాడు...శ్రవణ్ తెలీదంటున్నాడు... శిరీష కేసులో ఇంతకీ ఏం జరిగింది?


హైదరాబాదులోని ఫిల్మ్ నగర్ లో గల ఆర్జీ స్టూడియోలో ఆత్మహత్యకు పాల్పడిన బ్యూటీషియన్ శిరీష కేసులో సస్పెన్స్ కొనసాగుతోంది. చంచల్ గూడ జైలు నుంచి రాజీవ్, శ్రవణ్ ను రెండు రోజుల కస్టడీ నిమిత్తం పోలీసులు అదుపులోకి తీసుకుని వేర్వేరుగా విచారిస్తున్నారు. నిన్నటి విచారణలో రాజీవ్...కుక్కునూరుపల్లిలో ఎస్సై ప్రభాకర్ అత్యాచారయత్నం చేస్తున్నట్టు తలుపు సందుల్లోంచి కనిపించిందని చెప్పగా, తాను వారిని కేవలం సెటిల్మెంట్ కోసమే తీసుకెళ్లానని, ఎస్సై ఏం చేశాడో తనకు తెలియదని శ్రవణ్ చెప్పినట్టు తెలుస్తోంది.

ఈ లెక్కన ఆది నుంచి పోలీసులు సిగిరెట్ తాగేందుకు శ్రవణ్, రాజీవ్ బయటకు వచ్చారని అంటున్నప్పటికీ... అమ్మాయిల దగ్గరకు వెళ్దామంటూ రాజీవ్ కు శ్రవణ్ ఎరవేశాడంటూ వినిపిస్తున్న మరో వాదన దగ్గర పొంతన కుదరడం లేదు. దీనిపైనే పోలీసులు విచారిస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో ఇద్దరి మాటల మధ్య వ్యత్యాసం ఉంటే.. నిజానిజాలు రాబట్టడం ఎలాగో పోలీసులకు బాగా తెలుసన్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News