: డచ్ గడ్డపై కాలుమోపిన నరేంద్ర మోదీ!
తన అమెరికా పర్యటనను ముగించుకున్న భారత ప్రధాని నరేంద్ర మోదీ, వాషింగ్టన్ నుంచి బయలుదేరి నెదర్లాండ్స్ చేరుకున్నారు. తమ విదేశీ పర్యటనలో తొలుత పోర్చుగల్, ఆపై అమెరికాలను సందర్శించిన మోదీ, చివరిగా నెదర్లాండ్స్ చేరుకున్నారు. డచ్ గడ్డపై కాలు మోపిన ఆయనకు అక్కడి అధికారులు ఘనస్వాగతం పలికారు.
మరికాసేపట్లో డచ్ ప్రధాని మార్క్ రూటేతో కలసి ప్రత్యేకంగా చర్చించనున్న మోదీ, ఈ భేటీకి కింగ్ విలియం అలెగ్జాండర్ నూ ఆహ్వానించారు. వాతావరణ మార్పులు, ఉగ్రవాదం, ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం తదితర అంశాలపై వీరి మధ్య చర్చలు సాగుతాయి. ఆపై పలు కంపెనీల చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లతో సమావేశమయ్యే ఆయన, ఇండియాలో ఇన్వెస్ట్ మెంట్ కు ఉన్న అవకాశాలను తెలియజేస్తారు. ఆపై డచ్ లో ఉన్న ప్రవాస భారతీయులను కలుసుకుని వారితో చర్చించిన అనంతరం భారత్ కు బయలుదేరతారు.