: 17 ఏళ్ల అమ్మాయిపై అత్యాచారం చేసిన పూజారి!
అమ్మానాన్నలు తిట్టారనే కోపంతో ఇంటి నుంచి పారిపోయివచ్చిన ఓ 17 ఏళ్ల అమ్మాయిపై ఆలయ పూజారి అత్యాచారం చేసిన ఘటన సంచలనం రేపుతోంది. ఈ దారుణ ఘటన బెంగళూరులోని తుముకూరు చిక్కనాయకన్ హళ్లి ప్రాంతంలో చోటు చేసుకుంది. హోసూరు ప్రధాన రహదారిపై ఉన్న దేవాలయంలో దీపక్ (20) పూజారిగా పని చేస్తున్నాడు. దీపక్ తో సదరు అమ్మాయికి పరిచయం ఏర్పడింది.
తన తల్లిదండ్రులు తిట్టడంతో... వారిపై కోపంతో దుస్తులు, డబ్బు తీసుకుని ఇంటి నుంచి ఆమె బయటకు వచ్చేసింది. అనంతరం దీపక్ సహాయాన్ని అర్థించింది. దీన్ని అలుసుగా తీసుకున్న దీపక్... ఆలయంలోనే ఆమెను ఉత్తుత్తి పెళ్లి చేసుకుని, ఆలయం వెనకున్న తన గదిలోకి తీసుకెళ్లాడు. మన పెళ్లి అయిపోయిందని, ఇప్పుడు మనమిద్దం భార్యాభర్తలం అని చెప్పి, ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు.
మరోవైపు, కూతురు కనిపించకపోవడంతో ఆమె తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. ఆమె ఫోన్ కాల్స్ ఆధారంగా దీపక్ తో ఆమె మాట్లాడుతున్నట్టు పోలీసులు గుర్తించారు. దేవాలయానికి వచ్చి దీపక్ ను అరెస్ట్ చేశారు. బాలికను నమ్మించి, అత్యాచారం చేసిన దీపక్ పై పోలీసులు సీఆర్పీసీ 164, ఐపీసీ 376, 366ఏ, 366 పోస్కో చట్టాల కింద కేసు నమోదు చేశారు.