: శిరీషను ఒక్కరిద్దరు చంపలేదు.... చంపలేరు కూడాను!: శిరీష పిన్ని


హైదరాబాదులోని ఫిల్మ్ నగర్ ఆర్జీ స్టూడియోలో ఆత్మహత్యకు పాల్పడిందంటున్న బ్యూటీషియన్ శిరీషను రాజీవ్, శ్రవణ్ లు మాత్రమే చంపలేదని ఆమె పిన్ని ఆరోపించారు. శిరీషను ఒక్కరో లేక ఇద్దరో ఏమీ చేయలేరని ఆమె చెప్పారు. ఆమె చేతులను చూస్తే ఈ విషయం తెలుస్తుందని ఆమె అన్నారు. ఆరు అడుగుల పొడవైన శిరీషను ఒక్కరో లేక ఇద్దరో లోంగదీసుకోవడం అయ్యేపని కాదని ఆమె చెప్పారు. శిరీష హత్యలో ముగ్గురో లేక నలుగురో ఉండి ఉంటారని ఆమె చెప్పారు.

శిరీష ఆత్మహత్య ఘటన అనంతరం ఆమె హ్యాండ్ బ్యాగ్ ను ఆమె భర్త పోలీసులకు ఇచ్చాడని, అయితే కారులో ఉన్న మరొకరి హ్యాండ్ బ్యాగ్ ఎవరిదని ఆమె అడిగారు. ఈ కేసులో మరికొందరు వ్యక్తుల ప్రమేయం ఉందని నిర్ధారించేందుకు ఇంతకంటే సాక్ష్యం ఇంకేం కావాలని ఆమె ప్రశ్నించారు. ఆరు అడుగుల మనిషి ఫ్యాన్ కు వేలాడితే ఫ్యాన్ రెక్కలు కనీసం వంగవా? అని ఆమె ప్రశ్నించారు. అలాగే ఫ్యాంటు, షర్టు వేసుకున్న శిరీష దగ్గరకి చున్నీ ఎలా వచ్చిందని ఆమె నిలదీశారు. శిరీషను హత్య చేశారని ఎవరికైనా అర్థమవుతుందని ఆమె తెలిపారు.

  • Loading...

More Telugu News