: ఏపీ వైపు వెళ్లే టూరిస్టులను అడ్డుకుంటున్న తెలంగాణ టూరిజం సిబ్బంది!


అధిక ఆదాయాన్ని ఆర్జించడమే లక్ష్యంగా తెలంగాణ టూరిజం అధికారులు నాగార్జునసాగర్ వద్ద ఏపీ వెళుతున్న టూరిస్టులను అడ్డుకుంటున్నారు. హిల్ కాలనీ నుంచి విజయపురి సౌత్ లోని ప్రదేశాలను తిలకించేందుకు వెళ్లే వారిని ఆపుతున్నారు. ఇంతకీ తెలంగాణ అధికారుల నిర్వాకానికి కారణం ఏంటంటే, సాగర్ జలాశయం మధ్యలో ఉన్న నాగార్జున కొండ ఎంతో విశిష్టమైనది. ఇక్కడ బుద్ధుని అవశేషాలతో పాటు ప్రాచీన కాలానికి సంబంధించిన నిర్మాణాలు కూడా ఉన్నాయి. వీటిని తిలకించేందుకు నిత్యమూ వందల మంది వస్తుంటారు. ఆ కొండకు ఏపీ టూరిజం ప్రత్యేక లాంచీలను నడుపుతోంది.

 ఇక లాంచీల ఆదాయంలో వాటా కోరుకుంటున్న తెలంగాణకు, వీలైతే స్వయంగా లాంచీలు నడుపుకోవాలని చెబుతూ అనుమతులు కూడా ఇచ్చింది. దీంతో హిల్ కాలనీ సమీపంలోని సాగర్ ఎర్త్ డ్యామ్ వద్ద లాంచీ స్టేషన్ ను ప్రారంభించిన తెలంగాణ ప్రభుత్వం, అక్కడి నుంచి మరింత ఆదాయం కోసం ఏపీ వైపు వెళుతున్న వారిని అడ్డుకుంటోంది. ఏపీ సౌత్ లో లాంచ్ స్టేషన్ మూసివేశారని ప్రచారం చేస్తూ, నాగార్జున కొండకు వెళ్లాలంటే, ఇక్కడి నుంచే పోవాలని సూచిస్తోంది. వారి మాటలను నమ్మి కొండకు వెళ్లిన తరువాత విషయం తెలుసుకున్న పర్యాటకులు, అధికారుల నిర్వాకంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.

  • Loading...

More Telugu News