: శిరీష మెడకు వైరు బిగించి చంపేశారు... సాక్ష్యం ఇదిగో!: శిరీష మేనమామ


హైదరాబాదులోని ఫిల్మ్ నగర్ ఆర్జీ స్టూడియోలో ఆత్మహత్యకు పాల్పడిన బ్యూటీషియన్ శిరీషను హత్య చేశారని ఆమె మేనమామ తీవ్ర ఆరోపణలు చేశారు. తన మేనకోడలిపై తప్పుడు ముద్ర వేసే ప్రయత్నం జరుగుతోందని అన్నారు. తన మేనకోడలిని కారులో తీసుకొచ్చేటప్పుడే హతమార్చారని, మెడకు వైరు బిగించి ఆమెను హత్య చేశారని ఆయన చెప్పారు. ఈ మేరకు ఆమె మెడపై వైరు చారిక ఉందని ఆయన చెప్పారు.

అంతే కాకుండా మీడియా చూపిస్తున్న ఫోటోలలో ఆమె షర్టు బటన్ గుండీలు అపక్రమంలో పెట్టినట్టున్నాయని, కావాలంటే చూడాలని ఆయన సూచించారు. కింది బటన్ ను పై బొత్తంలో పెట్టారని, కావాలంటే మీడియా చూపిస్తున్న ఫోటోలలో సరిచూసుకోవాలని ఆయన స్పష్టం చేశారు. పెనుగులాటలో పైబటన్ తెగిపోయి ఉంటుందని, అందుకే ఆమెది ఆత్మహత్యగా చిత్రీకరించే తొందరలో ఆమె బటన్స్ పెట్టారే కానీ, సరిగ్గా పెట్టారా? లేదా? అన్నది సరిచూసుకోలేదని వారు చెప్పారు.

  • Loading...

More Telugu News