: షోయబ్ మాలిక్ ఏం చెప్పాడని కోహ్లీ, యువరాజ్ పగలబడి నవ్వారు?...వీడియో చూడండి


ఛాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్‌ లో పాకిస్థాన్ పై భారత్ ఓటమి అనంతరం జరిగిన అవార్డు ప్రదానోత్సవంలో రెండు జట్ల ఆటగాళ్లు పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో పాక్ ఆటగాళ్లు, టీమిండియా ఆటగాళ్లు కలిసిపోయి నిల్చున్నారు. ఈ సమయంలో షోయబ్ మాలిక్ ఏదో చెప్పిన అనంతరం విరాట్ కోహ్లీ, యువరాజ్ సింగ్ పగలబడినవ్వారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అభిమానులు విద్వేషాలు వెదజల్లుకున్నా, తమ మధ్య ఎలాంటి శత్రుత్వం లేదని చాటే ఈ వీడియోను నెటిజన్లు ఆసక్తిగా తిలకిస్తున్నారు.

కాగా, వీళ్లు ఎందుకు ఇంతలా నవ్వారన్న విషయంపై ఫుల్ క్లారిటీ వచ్చింది. గతంలో పాకిస్థాన్‌-వెస్టిండీస్‌ మధ్య జరిగిన మ్యాచ్‌ లో క్రిస్ గేల్ గాల్లోకి లేపిన బంతిని పట్టుకునేందుకు సయీద్ అజ్మల్, షోయబ్ మాలిక్ ఇద్దరూ పరుగెత్తారు. అయితే ఇద్దరం బంతిని పట్టుకునేందుకు పరుగెత్తడంతో ఢీ కొట్టే అవకాశముందని భావించిన తాము, బంతి సమీపంలోకి వెళ్లగానే, అజ్మల్ పట్టుకుంటాడని తాను... తాను పట్టుకుంటానని అజ్మల్ ఇద్దరం కలసి ఎంచక్కా బంతిని వదిలేశామని చెప్పాడు. దీంతో కోహ్లీ, యువీ పగలబడినవ్వారు.

  • Loading...

More Telugu News