: రూ.2 వేల కోట్లు వసూలు చేసిన ఏకైక భారతీయ చిత్రంగా 'దంగల్' రికార్డు!


బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ నటించిన దంగల్ విదేశాల్లో వీర విహారం చేస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా రూ.2 వేల కోట్లు వసూలు చేసిన తొలి భారతీయ చిత్రంగా చరిత్ర సృష్టించింది. ఈ మేరకు ప్రతిష్ఠాత్మక ఫోర్బ్స్ మేగజైన్ పేర్కొంది. చైనాలో 53వ రోజున రూ.2.5 కోట్లు వసూలు చేయడంతో, ప్రపంచ వ్యాప్తంగా మొత్తం రూ.2 వేల కోట్లు (307 మిలియన్ డాలర్లు) వసూలు చేసిన తొలి భారతీయ చిత్రంగా ఇది రికార్డులకెక్కినట్టు తెలిపింది. అంతేకాదు ఇంగ్లీషేతర సినిమాల్లో అత్యధిక వసూళ్లలో దంగల్ ఐదో స్థానంలో నిలిచింది. ఇక చైనాలో అత్యధిక వసూళ్ల సాధించిన తొలి 16 హాలీవుడ్ యేతర సినిమాల్లో దంగల్ కూడా చోటు సంపాదించుకుంది.

దంగల్ ఇప్పటికే ‘కెప్టెన్ అమెరికా: సివిల్ వార్’, ‘ఎక్స్ఎక్స్ఎక్స్: రిటర్స్ ఆఫ్ జండర్ కేజ్’, ‘ట్రాన్స్‌ఫార్మర్స్: డార్క్ ఆఫ్ ద మూన్, ‘టైటానిక్ 3డీ, ‘ది జంగిల్ బుక్’ సినిమాల రికార్డులను ఎప్పుడో బద్దలు గొట్టింది. ఫలితంగా దంగల్ ఇప్పుడు ప్రపంచంలో అతిపెద్ద బ్లాక్ బస్టర్ సినిమాలైన ‘అవతార్’, ‘జురాసిక్ వరల్డ్’ సినిమాల సరసన నిలిచింది. అవతార్, జురాసిక్ వరల్డ్ సినిమాలు చైనా బాక్సాఫీసు వద్ద 15, 14 స్థానాల్లో నిలవగా ఆ తర్వాతి స్థానంలో దంగల్ నిలిచింది.

  • Loading...

More Telugu News