: హైదరాబాదులోని కేపీహెచ్బీలో మూడు ఆలయాల్లో దొంగల స్వైరవిహారం!
హైదరాబాదులోని కూకట్ పల్లి హౌసింగ్ బోర్డు కాలనీ లోని మూడు దేవాలయాలపై దొంగలు పంజా విసిరారు. అర్ధరాత్రి దేవాలయాల్లో స్వైరవిహారం చేసిన దొంగలు అందినకాడికి దోచుకెళ్లిపోయారు. ప్రధానంగా సెవెన్ హిల్స్ లోని వెంకటేశ్వరస్వామి దేవాలయంలో దోపిడీ చేశారు. అమ్మవారి పంచలోహ విగ్రహంతో పాటు, కానుకల హుండీని కూడా ఎత్తుకెళ్లిపోయారు. ఈ క్రమంలో వారికి సంబంధించిన పట్టకారు వంటి వస్తువులను వదిలేశారు. దేవాలయాన్ని తెరిచిన పూజారులు చోరీ సంగతి గ్రహించి, పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సంఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు క్లూస్ సేకరిస్తున్నారు.