: మోదీ రాకతో మారిన మెలానియా వేషధారణ.. అలవాటుకు భిన్నంగా ‘పుక్కి’ ధరించి ఆహ్వానం.. ప్రత్యేక ఆకర్షణగా మారిన డ్రెస్!
అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాని మోదీకి వైట్‌హౌస్‌లో డొనాల్డ్ ట్రంప్, మెలానియా దంపతులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా మెలానియా ధరించిన దుస్తులు అందరినీ ఆకర్షించాయి. స్వతహాగా కురచ దుస్తులు, మోడ్రన్ దుస్తులు ధరించే మెలానియా మోదీకి ఆహ్వానం సమయంలో పసుపు రంగులో ఆకర్షణీయంగా ఉన్న పొడవైన డ్రెస్ (పుక్కి) ధరించి అందరినీ ఆశ్చర్యపరిచారు. మేలో ఆస్ట్రేలియా ప్రధాని మాల్కం టర్న్‌బుల్‌ను కలిసినప్పుడు మెలానియా బిగుతైన డ్రెస్ ధరించారు. ఇటీవల జరిపిన పలు పర్యటనల్లోనూ మెలానియా మోకాలి వరకు ఉండే బిగుతైన దుస్తులు ధరించారు. ఇప్పుడు అందుకు భిన్నంగా పాదాలు కూడా కనిపించని పుక్కి ధరించడం ప్రాధాన్యం సంతరించుకుంది. మెలానియా డ్రస్ ఇప్పుడు సర్వత్ర చర్చనీయాంశమైంది.