: ప్రేయసితో విండీస్ లో విహరిస్తున్న టీమిండియా మాజీ ఆటగాడు
టీమిండియా మాజీ దిగ్గజ పేసర్ జహీర్ ఖాన్ తన కాబోయే భార్యతో కలిసి వెస్టిండీస్ లో విహరిస్తున్నాడు. గత నెలాఖరున జహీర్ ఖాన్ కు సినీ నటి సాగరికతో గోవాలో నిశ్చితార్థం జరిగింది. టీమిండియా వెస్టిండీస్ పర్యటనలో ఉన్న నేపథ్యంలో జహీర్ కామెంటేటర్ గా వ్యవహరిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ప్రేయసితో కలిసి విండీస్ లో జహీర్ వుండాల్సివుంది. దీంతో కాబోయే భర్తతో కలిసి సాగరిక కూడా విండీస్ లో వాలిపోయింది. కరీబియన్ దీవులు ప్రపంచ ప్రసిద్ధి చెందిన పర్యాటక ప్రదేశాలన్న సంగతి తెలిసిందే. పగలు, రాత్రి పార్టీలు నడిచే కరీబియన్ దీవుల్లో కాబోయే దంపతులు సరదాగా ఎంజాయ్ చేస్తున్నారు.