: నడి రోడ్డు మీద అమ్మాయిని కౌగిలించుకుని ముద్దుపెట్టి పరారైన ఆటోడ్రైవర్.. పట్టుకున్న పోలీసులు
హైదరాబాదీ యువతిపై పుదుచ్చేరిలో లైంగిక దాడి చోటుచేసుకుంది. ఘటన వివరాల్లోకి వెళ్తే... హైదరాబాద్ కు చెందిన ముగ్గురు యువతులు చెన్నైలోని ఎలక్ట్రానిక్స్ సంస్థలో పనిచేస్తున్నారు. ఈ ముగ్గురూ విహారయాత్ర కోసమని పుదుచ్చేరి వెళ్లారు. అక్కడ ఒక హోటల్ లో రూమ్ తీసుకుని, పలు ప్రాంతాలు తిలకించారు. హోటల్ కు సమీపంలోని అన్నాసాలై ప్రాంతంలో నిలబడి రోడ్డు మీద మాట్లాడుకుంటుండగా... ఆ పక్కనే ఉన్న ఆటో డ్రైవర్ హఠాత్తుగా ఆ ముగ్గురిలో ఒక యువతిని అటకాయించి, కౌగిలించుకుని, ముద్దుపెట్టాడు.
దీంతో షాక్ కు గురైన ఆ ముగ్గురు యువతులు కేకలు వేయడంతో ఆ ఆటోడ్రైవర్ పరారయ్యాడు. దీంతో ఆటో నంబర్ నోట్ చేసుకున్న ముగ్గురు యువతులు నేరుగా ఒదియంజాలై పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశారు. ఆటో నంబరు ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులు, స్థానిక చిన్నయాపురం అక్కాస్వామికోవిల్ వీధికి చెందిన స్టాలిన్ ను అదుపులోకి తీసుకున్నారు. మద్యం మత్తులో అలా ప్రవర్తించానని అంగీకరించాడు. దీంతో అతని ఆటోను స్వాధీనం చేసుకుని, అతనిని అరెస్టు చేశారు.