: తలుపు సందులోంచి చూస్తే శిరీషను ఎస్సై అత్యాచారయత్నం చేస్తున్నట్టు కనిపించింది!: కీలక విషయాలు వెల్లడించిన రాజీవ్!
బ్యూటీషియన్ శిరీష ఆత్మహత్య ఘటనలో రెండు రోజుల కస్టడీకి తీసుకున్న పోలీసులకు ఏ2 నిందితుడు రాజీవ్ రెండు కీలక విషయాలు వెల్లడించాడు. శిరీషను వదిలించుకోవాలనే ఆలోచనలోనే ఉన్నానని చెప్పాడు. ముందు తేజస్వినిని వదిలించుకుని, తరువాత శిరీషను వదిలించుకోవచ్చనుకున్నానని, అందుకే తేజస్వినిని వదిలించుకునేందుకు ముగ్గురం కలిసి కప్పా కాఫీ షాప్ కు వెళ్లి మూడు గంటలపాటు సమాలోచనలు జరిపామని తెలిపాడు.
ఆ తరువాత శ్రవణ్ సూచనతోనే కుకునూరుపల్లి ఎస్సై దగ్గరకు తీసుకువెళ్లానని తెలిపాడు. శ్రవణ్, తాను బయటకు వచ్చామని, తర్వాత మళ్లీ లోపలకు వెళుతూ, తలుపు సందులోంచి చూసినప్పుడు శిరీషను ఎస్సై అత్యాచారయత్నం చేస్తున్నట్టు కనిపించిందని, ఆ తర్వాత తిరిగి వస్తున్నప్పుడు కారులో అరిచి గోలచేయడంతో రెండు మూడు సార్లు కొట్టానని రాజీవ్ తెలిపాడు. అత్యాచారయత్నం మాత్రమే జరిగితే ఆమె ఎందుకు అరిచి గోల చేసిందని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. కాగా, నేడు కూడా విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలో ఈ కేసులో మరిన్ని వివరాలు వెలుగు చూస్తాయని వారు భావిస్తున్నారు. నందు, నవీన్ ఎవరో తెలియదని, వారు శిరీష స్నేహితులు కావచ్చని రాజీవ్ చెప్పాడు.