: మోదీ వైట్ హౌస్ లో అడుగుపెట్టిన వేళ పాకిస్థాన్ కు గట్టి షాక్!
ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ లో అడుగు పెట్టిన వేళ పాకిస్థాన్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఎవరూ ఊహించని విధంగా ట్రంప్ తో మోదీ భేటీకి కొన్ని గంటల ముందు పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థ హిజ్బుల్ ముజాహిద్దీన్ చీఫ్ సయ్యద్ సలాహుద్దీన్ ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా అమెరికా ప్రకటించింది. ఈ మేరకు అమెరికా డిపార్ట్ మెంట్ ఆఫ్ స్టేట్ ప్రకటన విడుదల చేసింది.
అమెరికా నిర్ణయంతో ఉగ్రవాదంపై కఠిన వైఖరి అవలంబిస్తామని చెబుతూనే, భారత్ వాదిస్తున్నట్టు ఉగ్రవాదానికి పాక్ ఉతమిస్తోందన్న దానికి బలం చేకూరింది. ఈ తాజా నిర్ణయంతో అమెరికాలో ఉన్న హిజ్బుల్ ముజాహిద్దీన్ ఆస్తులన్నీ స్తంభిస్తాయి. అలాగే ఆ ఉగ్రవాద సంస్థకు నిధులు ఆగిపోతాయి. దీంతో భారత్ లోని కశ్మీర్ లో ఉగ్రవాదం కొంత అదుపులోకి వస్తుందని పరిశీలకులు భావిస్తున్నారు.