: ట్రంప్ షాక్: రంజాన్ విందును బంద్ చేసిన అమెరికా అధ్యక్షుడు!


పలు ముస్లిం దేశాల‌ ప్రజలు తమ దేశంలోకి రావడంపై పలు ఆంక్షలు విధించడం వంటి సంచ‌లన నిర్ణ‌యాలు తీసుకున్న అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ రోజు మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకుని షాక్ ఇచ్చారు. ఈ రోజు ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న ముస్లింలు రంజాన్ జ‌రుపుకుంటుండ‌గా మ‌రోవైపు అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌లో ముస్లింలకు విందు ఇచ్చే సంప్రదాయానికి స్వ‌స్తి చెప్పారు. ఎప్పుడూ ఇచ్చే విధంగా ఈ సారి విందు ఇవ్వ‌కుండా కేవలం ‘ముస్లింలకు శుభాకాంక్షలు’ అనే మాట‌ను మాత్రమే వైట్‌హౌస్ ప్ర‌తినిధులు చెప్పారు.

ముస్లింలకు రంజాన్‌ విందు ఇచ్చే సంప్రదాయం దాదాపు 200 ఏళ్ల కిందట అప్ప‌టి అధ్య‌క్షుడు థామస్‌ జెఫర్‌సన్ ప్రారంభించారు. త‌రువాత కొంత‌మంది అధ్య‌క్షులు దీన్ని పాటించారు. 1990 నుంచి బిల్‌క్లింటన్‌.. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన రిపబ్లికన్‌ జార్జ్‌ బుష్ ఈ సంప్ర‌దాయాన్ని చ‌క్క‌గా ముందుకు తీసుకెళ్లారు. బరాక్‌ ఒబామా కూడా రంజాన్‌ విందు ఘనంగా నిర్వ‌హించారు. డొనాల్డ్‌ ట్రంప్ మాత్రం అందుకు వ్య‌తిరేకంగా వ్య‌వ‌హ‌రిస్తూ రంజాన్ విందును బంద్ చేశారు. 

  • Loading...

More Telugu News