: అవినీతి పరుడైన జగన్ ను బలపరిచేందుకే ముద్రగడ పాదయాత్ర: కాపు కార్పొరేషన్ చైర్మన్


అవినీతిపరుడైన జగన్ ను బలపరిచేందుకే కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం పాదయాత్ర చేపట్టనున్నారని ఏపీ కాపు కార్పొరేషన్ చైర్మన్ రామానుజయ విమర్శించారు. ఈ మేరకు ముద్రగడకు ఆయన ఓ బహిరంగ లేఖ రాశారు. తల్లి, పిల్ల కాంగ్రెస్ లు కాపుల కోసం ఏం చేశాయి? అని ప్రశ్నించారు. కాపు రిజర్వేషన్లపై టీడీపీ ప్రభుత్వం ఒక్కో అడుగు ముందుకేస్తోందని, సమగ్ర నివేదిక ఇవ్వాలని మంజునాథ కమిషన్ ను సీఎం చంద్రబాబునాయుడు ఇప్పటికే ఆదేశించారని చెప్పారు. కాపులకు నష్టం చేసే విధంగా ముద్రగడ వ్యవహరిస్తున్నారని, పాదయాత్ర పేరుతో అరాచకం సృష్టించే ప్రయత్నం మానుకోవాలని ఈ లేఖలో రామానుజయ హితవు పలికారు. మూడేళ్లలో కాపు కార్పొరేషన్ కు రూ.2100 కోట్లు ఇచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు.

  • Loading...

More Telugu News