: మహేశ్ బాబుకు, నాకు ఈ సినిమా గొప్ప చిత్రం అవుతుంది: దర్శకుడు వంశీ పైడిపల్లి


మహేష్ బాబు హీరోగా తన దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా తమ కెరీర్ లో ఓ గొప్ప చిత్రంగా నిలుస్తుందని దర్శకుడు వంశీ పైడిపల్లి అన్నారు. వీరిద్దరి కలయికలో రానున్న తొలి చిత్రమిది. ఈ సందర్భంగా వంశీ పైడిపల్లి మాట్లాడుతూ, ఈ చిత్రం కథ చెప్పగానే సినిమా చేద్దామని మహేశ్ బాబు అన్నారని, ఆయన చాలా ఆసక్తిగా ఉన్నారని చెప్పారు. కాగా, ఈ చిత్రం టైటిల్ ఇంకా ఖరారు చేయలేదు. మహేష్ సరసన హీరోయిన్ గా పూజా హెగ్డే నటించనున్నట్టు తెలుస్తోంది. 

  • Loading...

More Telugu News