: 'వనజీవి' రామయ్యకు ఆర్థిక సాయం చేసిన చంద్రబాబు


హైదరాబాద్ లోని కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పద్మశ్రీ వనజీవి రామయ్యను ఏపీ సీఎం చంద్రబాబు, టీడీపీ నేతలు ఈ రోజు పరామర్శించారు. ఆయనతో కొంతసేపు మాట్లాడారు. ఆరోగ్యం త్వరలోనే కుదుటపడుతుందుని రామయ్యకు ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా వనజీవి రామయ్యకు ఓ మొక్కను కానుకగా అందజేసిన చంద్రబాబు, ఆయనకు ఆర్థిక సాయం కింద ఐదు లక్షల రూపాయల చెక్కును ఇచ్చారు. కాగా, వనజీవి రామయ్యగా ప్రఖ్యాతి గాంచిన రామయ్య ఇటీవల గుండెపోటుకు గురయ్యారు. ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించిన అనంతరం, మెరుగైన వైద్య సేవల నిమిత్తం హైదరాబాద్ లోని  కేర్ ఆసుపత్రికి తీసుకువచ్చారు.

  • Loading...

More Telugu News