: రవితేజ సోదరుడు భరత్ నాతో మాట్లాడిన ఆఖరి మాట ఇదే: మిత్రుడు సత్యదేవ్
ప్రముఖ నటుడు రవితేజ సోదరుడు భరత్ రాజు కారు ప్రమాదంలో మృతి చెందిన విషయాన్ని ఆయన స్నేహితులు జీర్ణించుకోలేకపోతున్నారు. మద్యానికి, డ్రగ్స్ కు బానిసైన భరత్, వ్యక్తిగతంగా మాత్రం చాలా మంచివాడని అంటున్నారు. ఈ విషయాన్ని బెంగళూరుకు చెందిన భరత్ మిత్రుడు సత్యదేవ్ ఓ న్యూస్ ఛానెల్ కు చెప్పారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మద్యానికి, డ్రగ్స్ కు బానిసైన భరత్ కు ఆ దురలవాట్ల నుంచి బయటపడమని తాను తరచుగా చెబుతుండేవాడినని అన్నారు. ఈ క్రమంలో భరత్ చనిపోవడానికి కొన్ని రోజుల ముందు తనకు ఫోన్ చేశాడని, ఈ దురలవాట్ల నుంచి తాను బయటపడాలని అనుకుంటున్నట్టు చెప్పాడని అన్నారు. తనను బెంగళూరుకు తీసుకువెళ్లి అక్కడ ఉండే మంచి రీహ్యాబిటేషన్ సెంటర్ లో చేర్పించి చికిత్స చేయించాలని కోరాడని చెప్పారు. ‘నేను మందు తాగడం కాదు.. మందే నన్ను తాగేస్తోంది’ అని భరత్ తనతో మాట్లాడిన ఆఖరి మాట అంటూ సత్యదేవ్ వాపోయారు.