: హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో వర్షం
హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో ఈ రోజు సాయంత్రం వర్షం కురిసింది. సైదాబాద్, మలక్ పేట్, చాదర్ ఘాట్, దిల్ సుఖ్ నగర్, కొత్తపేట, ఎల్బీనగర్, మోతీనగర్, రాజీవ్ నగర్ తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. అయితే, ఆయా ప్రాంతాల్లో కురిసిన వర్షానికి రోడ్లపై ఉన్న గుంతల కారణంగా వర్షపు నీరు వాటిలో నిలిచిపోయింది. దీంతో, వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. కాగా, నిన్న సాయంత్రం నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసిన విషయం విదితమే.