: టీమిండియా కోచ్ రేసులో నేనా? నో!: శ్రీలంక ఆటగాడు జయవర్ధనే
భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ పదవి నుంచి అనిల్ కుంబ్లే తప్పుకున్న నేపథ్యంలో బీసీసీఐ కొత్త కోచ్ కోసం అన్వేషిస్తోన్న విషయం తెలిసిందే. ఇందుకోసం శ్రీలంక మాజీ ఆటగాడు మహేల జయవర్ధనే దరఖాస్తు చేసినట్లు పుకార్లు షికార్లు చేశాయి. ఈ వార్తలపై స్పందించిన జయవర్ధనే తాను భారత్ క్రికెట్ కోచ్ పదవి రేసులో లేనని స్పష్టం చేశాడు.
తాను ప్రస్తుతం ఐపీఎల్‌లో ముంబయి ఇండియన్స్ జట్టుతో పాటు బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో ఓ జట్టుతో ఉన్న ఒప్పందాలతో తీరిక లేకుండా ఉన్నట్లు చెప్పాడు. కాగా, టీమిండియా కోచ్ పదవికి దరఖాస్తులు చేసుకున్న వీరేంద్ర సెహ్వాగ్, టామ్ మూడీ, లాల్‌చంద్ రాజ్‌పుత్, దొడ్డ గణేశ్‌లకు గంగూలీ, సచిన్, లక్ష్మణ్‌తో కూడిన క్రికెట్ సలహా మండలి త్వరలోనే ఇంటర్వ్యూలు నిర్వహించనుంది.