: ‘రంగస్థలం 1985’ రాజమండ్రి షెడ్యూల్ ముగిసింది: హీరో రామ్ చరణ్
దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో హీరో రామ్ చరణ్ నటిస్తున్న ‘రంగస్థలం 1985’ చిత్రం షూటింగ్ కొన్ని రోజులుగా రాజమండ్రిలోని అందమైన లొకేషన్లలో నిర్వహించారు. అక్కడ షూటింగ్ షెడ్యూల్ ను పూర్తి చేసుకున్నట్టు రామ్ చరణ్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా పేర్కొన్నాడు. ‘రాజమండ్రిలో, పరిసర ప్రాంతాల్లో షూటింగ్ షెడ్యూల్ ముగించుకుని హైదరాబాద్ కు చేరుకున్నా. సినిమా షూటింగ్ నిమిత్తం 80వ దశకంలో నివసించినట్టుగా ఉండటం చాలా థ్రిల్ కు గురి చేసింది’ అని ఓ ట్వీట్ లో పేర్కొన్నాడు. మరో ట్వీట్ లో ప్రముఖ ఆంగ్ల కవి, నాటక రచయిత విలియమ్ షేక్స్ పియర్ కొటేషన్ ను రామ్ చరణ్ పోస్ట్ చేశాడు. ‘నిజాయతీ అంతటి ధనికమైన వారసత్వపు ఆస్తి మరొకటి లేదు’ అని ఆ కొటేషన్ అర్థంగా చెప్పవచ్చు.