: ప్రేమ విఫలమైందని లేఖ రాసి... యువకుడి బలవన్మరణం!
తన ప్రేమ విఫలం కావడంతో ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడిన ఘటన మేడ్చల్ జిల్లా ఘట్ కేసర్ మండలం మాధవ రెడ్డి బ్రిడ్జి కింద ఉన్న రైల్వే ట్రాక్ వద్ద చోటుచేసుకుంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని ఆ యువకుడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ యువకుడు బోడుప్పల్‌లో నివాసం ఉంటున్న విజయ్‌కుమార్ (25)గా పోలీసులు గుర్తించారు. ఘటనాస్థలి వద్ద విజయ్‌కుమార్ రాసి పెట్టిన ఆత్మహత్య లేఖను స్వాధీనం చేసుకున్నామని, తన ఆత్మహత్యకు కారణం ప్రేమ విఫలం కావడమేనని రాశాడని చెప్పారు. ఆ యువకుడి స్వస్థలం నాగర్ కర్నూల్ జిల్లా తుర్కపల్లి మండలం బాపల్లి గ్రామం అని చెప్పారు.