: సైన్యానికి స్వేచ్ఛను ఇవ్వండి.. కాశ్మీర్ లో శాంతి నెలకొంటుంది: ములాయం సింగ్ యాదవ్
జమ్ముకశ్మీర్ లో శాంతి నెలకొనాలంటే.. సైన్యానికి పూర్తి స్థాయిలో స్వేచ్ఛను ఇవ్వాలని సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ అన్నారు. రంజాన్ సందర్భంగా ఈ రోజు ఆయన లక్నోలోని ఐష్ బాగ్ ఈద్గాను దర్శించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, వేర్పాటువాదులపై కఠినంగా వ్యవహరించాలని సూచించారు. రాష్ట్రపతి ఎన్నికల గురించి ఆయనను ప్రశ్నించగా... ఇప్పుడేమీ మాట్లాడనని తెలిపారు. 1996లో యూపీయే హయాంలో ములాయం సింగ్ రక్షణ మంత్రిగా పనిచేశారు.